టాలీవుడ్ లవర్ బాయ్ నాగశౌర్య మంచిరేవుల ఫామ్ లో పేకాట ఆడుతూ కొంతమంది పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసుల విచారణ వేగవంతంగా సాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సుమన్‌ను ఉప్పరపల్లి కోర్టు 2రోజుల కస్టడీకి అప్పగించింది. ఈరోజు, రేపు గుత్తా సుమన్‌ను నార్సింగి పోలీసులు ప్రశ్నించనున్నారు. అంతే కాకుండా ఇవాళ నాగశౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్ పోలీస్ స్టేషన్‌కు రానున్నారు.
ఫామ్‌హౌస్ రెంటల్ అగ్రిమెంట్లు తేవాలని రవీంద్రకు పోలీసులు సూచించినట్టు తెలుస్తోంది.
రెంటల్ అగ్రిమెంట్ల ఆధారంగా పోలీసులు రవీంద్రను ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి.
ఇక గుత్తా సుమన్‌పై ఏపీలో ఉన్న కేసులపై నార్సింగి పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇప్పటికే సుమన్‌పై కేసు వివరాలను ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు నార్సింగి పోలీసులకు అప్పగించారు. బ్లాక్ మెయిల్, ఫోర్జరీ, చీటింగ్ కేసులు నింధితుడు సుమన్ పై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.