ఎక్స్‌పోజింగ్‌లో అమలాపాల్‌ దూకుడు..సోష‌ల్ మీడియాలో ఫోటోలు షేర్‌..!

N ANJANEYULU
ఈ మ‌ధ్య కాలంలోనే తన సొంత నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించిన హీరోయి్ అమలాపాల్ ఎక్స్‌పోజింగ్‌లో దూకుడు పెంచుతోంది. సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని ఆమె త‌న ఫోటోల‌ను షేర్ చేసింది. ఈ ఫోటోల‌ను చూసిన నెటిజ‌న్‌లు ఫిదా అవుతున్నారు. దీంతో వెంట‌నే లైకుల వ‌ర్షం సైతం కురిపిస్తున్నారు. సింధుస‌మ‌వెలి అనే సినిమా ద్వారా వెండి తెరకు ప‌రిచ‌యం అయింది ఈ మ‌ల‌యాల బ్యూటి. ఆ తరువాత కోలివుడ్ లో మైనా, వెట్టై, వేలైయిల్లా ప‌ట్టాదారి-1,2 భాస్క‌ర్ ఓరు రాస్కెల్, రాక్ష‌స‌న్ వంటి చిత్రాల‌లో న‌టించిన‌ది. టాలివుడ్‌లో కూడ అమ‌లాపాల్ స‌త్తాను చాటిన‌ది.

త‌న కెరీర్ మంచి స్టేజ్‌లో ఉన్న స‌మ‌యంలోనే కోలివుడ్ డైరెక్ట‌ర్ ఏఎల్ విజ‌య్ ను ప్రేమించింది. 2014లో పెళ్లి చేసుకున్న‌ది అమ‌ల‌. వీరి వివాహ జీవితం ఎక్కువ రోజులు నిల‌వ‌లేదు. ముచ్చ‌ట‌గా మూడేళ్ల కాలంలో అన‌గా 2017లోనే ప‌ర‌స్ప‌ర అంగీకారంతో వీరిద్ద‌రూ విడిపోయారు. ఎప్ప‌టిలాగానే అమ‌లాపాల్ మాత్రం సినిమాల్లో న‌టిస్తున్నారు. ఎక్కువ‌గా హీరోయిన్ ప్రాధాన్య‌త గ‌ల చిత్రాల‌లో మాత్ర‌మే ఆమె న‌టిస్తూ అమ‌లాపాల్ ముందుకు సాగుతోంది. చివ‌ర‌గా ఆమె న‌టించిన చిత్ర ఆడై. ప్ర‌స్తుతం ఆడుజీవితం, అందోఅంద ప‌ర‌వైపోల అనే రెండు సినిమాలు ఆమె చేతిలో ఉండ‌గానే.. త‌న సొంత నిర్మాణ సంస్థ‌పై క‌డావ‌ర్ అనే పేరుతో ఒక చిత్ర నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టినది. ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ను పోషిస్తున్న‌ది. త‌న‌కు ల‌భించిన ఖాళీ స‌మ‌యాన్ని వృథా చేసుకోకుండా ఎక్స్‌పోజింగ్‌తో రెచ్చిపోతూ.. ప్ర‌త్యేకంగా ఫోటో షూట్‌ల‌ను నిర్వ‌హిస్తూ ప‌బ్లిసిటీని సంపాదించుకుంటుంది అమలాపాల్‌.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: