జై బాల‌య్య : న‌న్ను భ‌య‌పెడుతున్నావ్ ఏంటి బాల‌య్య

N ANJANEYULU
రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులు ఎప్ప‌టి నుంచో  ఎంతగానో ఎదురు చూస్తున్న బాలయ్య టాక్ షో ప్రీమియర్ ఆహా ఓటీటీలో ప్రసారమవుతోంది. ఇక మొదటి ఎపిసోడ్ లో మంచు మోహన్ బాబు ఫ్యామిలీ సందడి చేసిన సంగతి విధిత‌మే. మొదటి ఏపిసోడ్‌కు మోహ‌న్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మి, హాజరయ్యారు. దీంట్లో మోహ‌న్‌బాబు బాల‌య్య‌ను ఆస‌క్తిక‌రంగా ప్ర‌శ్న‌లు అడిగారు.

బాంబులు వేద్దాం రండి అని బాల‌య్య‌ను పిలిచారు. పిలిస్తే న‌న్ను భ‌య‌పెడుతున్నాడు అని అంటున్నాడు. ఆ బాంబుల‌ను లాగితే ప్ర‌శ్న‌లు ఉంటాయి. బాంబులు మ‌న‌కు కొత్త కాదు క‌దా.. రాయ‌ల‌సీమ మ‌న‌కు కొత్త  కాదు క‌దా.. రాయ‌ల‌సీమ రామ‌న్న చౌద‌రి మీకు స‌మ‌ర‌సింహారెడ్డి నాకు అని పేర్కొన్నాడు. ఇలా మొద‌టి ప్ర‌శ్న మీ ప‌క్క‌న న‌టించిన వాళ్ల‌లో మీకు  న‌చ్చ‌ని వాళ్లు ఎవ‌రు అని అడిగితే ఆడ‌వాళ్ల మ‌గ‌వాళ్ల అని అన్నాడు మోహ‌న్‌బాబు. ఎవ‌రైనా ప‌ర్వాలేదు అని బాల‌య్య చెప్పాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: