ఆహాలో అన్ స్టాపబుల్ విత్
బాలయ్య టాక్ షో ప్రసారం అవుతుండగా ఆసక్తికర ప్రశ్నలతో
బాలయ్య ఆకట్టుకుంటున్నారు. సినిమాలలో నటించి నట సింహంగా పేరుపొందిన
బాలయ్య ఇప్పుడు హోస్ట్ గా కూడా అదరగొడుతున్నారు అంటూ అభిమానులు చెబుతున్నారు. ఇక ఈ షోలో మంచు విష్ణు అబద్ధాలు చెప్పడని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. కాగా
మంచు లక్ష్మి మధ్యలో మాట్లాడుతూ లేదు నాకు అమ్మకు విష్ణు అబద్దాలు చెప్తాడు అంటూ వ్యాఖ్యానించింది.
దాంతో
బాలయ్య నేను
లక్ష్మీ నే నమ్ముతాను అంటూ ఆసక్తికర కామెంట్ చేశాడు. అంతే కాకుండా విష్ణును నమ్మలేనని అన్నాడు. అదేవిధంగా గా తన
తండ్రి ఎక్కడ ఉన్నావు అని అడిగితే తాను ఎప్పుడూ అబద్ధం చెప్తా అంటూ మంచులక్ష్మి చెప్పుకొచ్చింది. ఇక మంచు ఫ్యామిలీలో ముగ్గురితో
బాలయ్య సంభాషణ ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇక ఆహాకు
అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించడం...
బాలయ్య హోస్ట్ గా చేయడం గెస్ట్ గా మోహన్ బాబు రావడంతో ఆహా క్రేజ్ మరింత పెరిగిపోయింది.