హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట బాలిక అనుమానస్పద మృతి కేసులో సస్పెన్స్ కొనసాగుతున్నది. గురువారం ఉదయం ఒక షాపు ముందు దాదాపు నాలుగు సంవత్సరాల బాలిక మృతదేహం లభ్యమైన విషయం విధితమే. ఈ విషయంపై స్థానికంగా ఉన్న ప్రజలు పంజాగుట్ట పోలీసులకు సమాచారం చేరవేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికీ చేరుకొని ఆ బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఇది ఇలా ఉండగా ఆ బాలిక శరీరంపై ఎలాంటి గాయాలు లేవని తెలుస్తున్నది. ఇప్పటివరకు వచ్చిన అదృశ్యంకు సంబంధించిన కేసులను పోలీసులు పరిశీలిస్తున్నారు. అదేవిధంగా సమీపంలో ఉన్న సీసీ కెమెరాలపై పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఆ బాలిక ఎవరు..? ఎలా మృతి చెందినది అనే విషయంపై ఆరా తీస్తున్నారు. అదృశ్యమైన ఈ బాలిక గురించి
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదని తెలుస్తున్నట్టు సమాచారం. ఈ సస్పెన్స్ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొంటున్నారు.