ప్రభుత్వ పధకాలు స్టేటస్ రిపోర్టలు పంపినీ చెయ్యడానికి జిల్లా కలెక్టర్లకు ఏపీ ప్రణాళిక శాఖ సీఈఓ ప్రభుత్వ కార్యదర్శి విజయ్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటికి రెండు బ్రౌచర్ల రూపంలో ప్రభుత్వం పథకాల వివరాలు పంపినీ చెయ్యాలని ఆదేశించారు. ఒకటవ బ్రోచర్ లో రెండవ మాట ఇచ్చిన మాటకే పెద్ద పీట వేశారు. జగనన్న మ్యానిఫెస్టో - ఆరు పేజీలు ఉంది. రెండవ బ్రోచర్ లో సంక్షేమ పథకాలు. ఉన్నాయి. అంతే కాకుండా బ్రోచర్ లు మొత్తం పదహారు పేజీలు ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
బ్రోచర్ల ముద్రణ ఇప్పటికే పూర్తయిందని ఇవి ఆర్‌డిఓ కార్యాలయానికి చేరిన తరవాత ప్రణాళికా బద్దంగా ఇంటింటికి పంపిణీ చెయ్యాలని అధికారులకు సూచించారు. బ్రోచర్ల ముద్రణా కంపెనీ అనుకున్న సమయానికే అందరికీ బ్రోచర్లను అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో కలెక్టర్లకు సూచనలు చేశారు. ఇక సీఎస్ చేసిన ఆదేశాలతో కలెక్టర్ లు అప్రమత్తం అయ్యారు. బ్రోచర్ లను సరైన సమయానికి పంపిణీ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.