తెలంగాణలో యాసంగి వరి పంట అంటే బాయిల్డ్ రైసే..?
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రబీ సీజన్‌లో వరిపంట కొనుగోలుపై సీఎం మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో యాసంగి వరి పంట అంటే బాయిల్డ్ రైసే అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అడుగంటిపోయిన జలాలను పెంచడానికి మిషన్ కాకతీయ పథకం తొలుత తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో కూడ ప్రవేశపెట్టలేదు. చెరువుల స్థిరీకరణ కోసం, ఎరువుల సరఫరా వల్ల వ్యవసాయంలో అధ్భుత ప్రగతిని సాధించాం. ఆహార కొరత విషయంలో కేంద్రానిదే పూర్తి బాధ్యత అని పేర్కొన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు విషయం లో కాలికి పెడితే మెడకు, మెడకు పెడితే కాలికి అన్న విదంగా వ్యహరిస్తోందని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
తెలంగాణలో వరిపంట కోసం బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడుతలేరు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కేంద్రాన్ని ఎందుకు ఒప్పించడం లేదని కేసీఆర్ అడిగారు. కేంద్రమంత్రులకు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించినా స్పందించడం లేదు.ప గ్రామీణ వ్యవస్థను పరిపుష్టం చేయడం కోసమే మేము లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని కృషి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.