ప్రగతి భవన్‌లో ధాన్యంకొనుగోలుపై సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని పేర్కొన్నారు. రైతులు రబీ సీజన్‌లో వరి వేసి నష్టపోవద్దు అనే నిన్న మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పినట్టు గుర్తు చేశారు సీఎం. రైతు వ్యతిరేక చట్టాలపై కేంద్రానికి అల్టిమేటంమని కేసీఆర్ పేర్కొన్నారు. ఉత్తరభారతదేశంలో రైతులకు మద్దతుగా మాపోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇక నుంచి కేంద్రానికి చుక్కలు చూపిస్తాం.. నిద్ర పోనివ్వమని పేర్కొన్నారు. కేంద్రం నుండి సానుకూల వైఖరిని తీసుకొని రా. లేదంటే ని మెడలు వంచుతాం అని బండిసంజయ్‌పై నిప్పులు చెరిగారు కేసీఆర్.
కేసీఆర్ బ్రతికి ఉండగా నీ ఆటలు సాగవు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మనిషివే అయితే, నిజాయితీగా ఉంటే ఢిల్లీకి పోయి ఆర్డర్ తీసుకురా అని విమర్శించారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు. దమ్ముంటే రైతులకు మేలు చేయి. అల్లటప్పగాళ్ల మాటలు అసలు నమ్మవద్దని రైతులకు సూచించారు సీఎం కేసీఆర్. ఇక నీ సొల్లు పురాణం ఆపు. రైతులను అసలు ఆగం చేయకు అని పేర్కొన్నారు. రైతులను గందరగోలానికి గురి చేస్తే బండి సంజయ్ ఆట కట్టిస్తాం అని వెల్లడించారు. సిల్లి బీజేపీ, సొల్లు మాటలు రైతులు నమ్మవద్దని మరీ సూచించారు ముఖ్యమంత్రి.