మా మిత్రం ప‌క్షం మ‌స్లీజ్ : కేసీఆర్

N ANJANEYULU
 ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రిగిన విలేక‌ర్ల స‌మావేశంలో ఆదివారం మిత్రప‌క్షంపై కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ‌లో దాదాపు 110 ఎమ్మెల్యేల‌తో మిత్ర ప‌క్షంతో క‌లిసి ఉన్నాం. అంద‌రం క‌లిసి బీజేపీని ఉరికిచ్చి కొడుతాం. ఢిల్లీలో ధ‌ర్నా చేస్తాం అని చెప్పారు. మా మిత్ర ప‌క్షం మ‌స్లీజ్ అని చెప్ప‌క‌నే చెప్పారు కేసీఆర్‌. తెలంగాణ రైతాంగాన్ని మోసం చేయ‌వ‌ద్దు అని పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌ల‌లో ఎక్కడ అవినీతి జ‌రిగిందో అక్క‌డ కేసు పెట్టండి. కుక్క‌లు మొరిగినట్టు మెరుగుతున్నారు. మ‌హామ‌హార‌కాసిల‌తో కొట్లాడాం. మేము సంస్కార‌వంతంగా ఉన్నాం.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ నీవు మ‌నిషివి అయితే ఢిల్లీకి వెళ్లి ఆర్డ‌ర్ తీసుకురా..?  బీజేపీ రైతుల‌ను ముంచాల‌ని చూస్తుంది. టీఆర్ఎస్ రైతుల బాగు కోసం ప‌ని చేస్తుంది. కేవ‌లం ఒక ఎన్నిక‌లో ఓడి పోయినంత మాత్రాన బీజేపీ ఉర్రూత‌లు ఊగుతున్నారు. ఎన్నిక‌లు అన్న‌ప్పుడు గెలుపు ఓట‌ములు స‌హ‌జం అని స్ప‌ష్టం చేశారు. అల్లాట‌ప్పగాళ్ల‌ మాట‌లు వింటే రైతులకు ఇబ్బందులు ఎదుర‌వుతాయి. ఎవ‌రి మాట‌లు న‌మ్మ‌కుండా ప్ర‌భుత్వం మాట వినాల‌ని కేసీఆర్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: