మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్,
జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు
రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న
సినిమా ఆర్ఆర్ఆర్. ఈ
సినిమా సంక్రాంతి కానుకగా
జనవరి 7వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ
సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం
సినిమా ప్రమోషన్ల వేడి పెంచేశారు. ఇప్పటికే దోస్తీ అనే ఒక ప్రమోషనల్ సాంగ్ తో
ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ ఆల్బం పై జనాలు ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురు చూసేలా చేసిన
రాజమౌళి తాజాగా నాటు నాటు అనే సాంగ్ ప్రోమో విడుదల చేశారు.
కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ పాట ఫుల్
జోష్ లో ఉంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం,
కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేసిన ఈ పాట ప్రోమో అన్ని భాషలలోనూ అదరగొడుతోంది. ప్రోమో తోనే ఇరగదీసిన
కీరవాణి ఫుల్ సాంగ్ ను ఏ రేంజ్ లో కంపోజ్ చేసి ఉంటాడో అని అభిమానులు ఈ పూర్తి పాట కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నాటు నాటు పూర్తి పాట
నవంబర్ 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు రాబోతుంది.