తెలంగాణలో 12 ఎమ్మెల్సీలకు షెడ్యూల్
తెలంగాణలో అత్యధికంగా ఎమ్మెల్సీ సీట్లు ఉండడంతో అధికార టీఆర్ఎస్ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా కడియం శ్రీహరి, సిరికొండ మధునచారి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎల్.రమణ, ఎంసీకోటిరెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి పేర్లను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. గవర్నర్ కోటాలో గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరును ఫైనల్ చేశారని సమాచారం. కానీ దీనికి సంబంధించిన ప్రకటన అధికారికంగా వెలువడే అవకాశం ఉన్నది. ఇప్పటికే షెడ్యూల్ రావడంతో ఎమ్మెల్సీ ఎన్నికలపై అత్యంత త్వరలోనే టీఆర్ఎస్ ప్రకటించే అవకాశం ఉంది.