హరీష్ రావుకైనా ఈ వైద్య శాఖ కలిసివస్తుందా..?

MOHAN BABU
తెలంగాణ మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖను మంత్రి హరీష్ రావు అప్పగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలియజేశారు. అయితే ఇప్పటికే ఈ శాఖను తెలంగాణలో చేపట్టిన ఇద్దరూ ఇబ్బందుల పాలయ్యారు. ఏకంగా ఈటల రాజేందర్ అయితే పూర్తిగా ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. తర్వాత ఈ శాఖను సీఎం కేసీఆర్ చూసుకున్నారు. ప్రస్తుతం ఆ పదవిని హరీష్ రావుకు అప్పగించడంతో,  ఈ శాఖ కలిసి వస్తుందా లేదా తెలుసుకుందాం..?

 తెలంగాణ మంత్రి వర్గంలో మరో శాఖ భర్తీ అయిపోయింది. ఇంతకుముందు  వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ పార్టీని వీడి బిజెపికి వెళ్లడంతో పాటుగా  తెరాస పార్టీకి  తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి హుజురాబాద్ ఉప ఎన్నిక రావడానికి కారకుడయ్యాడు. దీంతో అక్కడ  ఎంతో ఉత్కంఠ పోరు మధ్య ఈటల గెలుపొంది కెసిఆర్ పై విజయ బావుటా  ఎగరవేశారు. దీంతో ఈటల రాజేందర్ యొక్క వైద్య ఆరోగ్య శాఖను కొద్ది రోజులు సీఎం కేసీఆర్  చూసుకున్నారు. తర్వాత ఆయన ఈ శాఖను మంత్రి హరీష్ రావుకు అప్పజెప్పారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ శాఖను తీసుకున్నటువంటి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తన మంత్రి పదవి నుండి తొలగించ బడ్డాడు.


తర్వాత ఈ పదవిని ఈటల రాజేందర్ కు అప్పజెప్పారు. ఆయన కూడా పూర్తిగా పార్టీని వీడి వెళ్లిపోయారు. మళ్లీ ఈ పదవిని హరీష్ రావు అప్పగించడం వెనక ఆంతర్యమేమిటో  అర్థం కావడం లేదు. అయితే ఈ పదవి చేపట్టిన వారికి ఏదో ఒక విధంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ప్రస్తుతం హరీష్ రావు ఈ వైద్య శాఖను తీసుకున్నారు. మరి హరీష్ రావు కైనా ఈ వైద్య ఆరోగ్య శాఖ కలిసివస్తుందా లేక వారిలాగే బెడిసికొడుతున్న అనేది పలువురి మదిలో మెదిలే ప్రశ్న.. ఏం జరుగుతుందనేది ముందు ముందు మనకు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: