బ్రేకింగ్: హైదరాబాద్ లో దారుణం, పెళ్ళికి ఒప్పుకోలేదని నరికేసాడు

ఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా సరే ఎక్కడో ఒక చోట ఏదోక ఘటన జరుగుతూనే ఉంది ఈ మధ్య కాలంలో. తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఘటన కంగారు పెట్టింది. శిరీష అనే యువతిపై బసవరాజు అనే యువకుడు కత్తితో దాడి చేయటం సంచలనంగా మారింది. హస్తినపురం లోని యువతి ఇంట్లోకి ప్రవేశించి విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసాడు ప్రియుడు బసవరాజు.

ప్రేమించి పెండ్లికి నిరాకరించి మరొక వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకుందన్న కోపంతో బస్వరాజు దాడికి పాల్పడ్డాడు అని తెలుస్తుంది. శిరీష పరిస్థితి విషమంగా ఉండటం తో నవీన హాస్పిటల్ కి కుటుంబ సభ్యులు తరలించారు అని తెలుస్తుంది. పోలీస్ లు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు అని సమాచారం. నిందితుడు బసవరాజుది మరియు బడితురాలిది ఇద్దరిది వికారాబాద్ జిల్లా దౌలతబాద్ మండలం అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: