గిరిపుత్రుల‌కు త‌ప్ప‌ని డోలీ క‌ష్టాలు

N ANJANEYULU
ఆంధ్ర‌ప్ర‌దేవ్‌లోని విజ‌య‌న‌గ‌రం జిల్లా శృంగ‌వ‌ర‌పు కోట మండ‌లంలో ఉన్న గిరిపుత్రుల‌కు డోలీ  కష్టాలు త‌ప్ప‌డం లేదు. ఇటీవ‌ల అర్దరాత్రి ఓ గర్బిణి మహిళకు పురిటినొప్పులు రావడంతో టార్చిలైట్లతో డోలీలో 10 కిలోమీటర్ల కొండ దించారు.  దబ్బగుంట వరకు డోలీలో మోసుకుంటూ వచ్చి అక్కడ నుండి ఆటోలో శృంగవరపుకోటలో ఉన్న ఆసుప‌త్రికి త‌ర‌లించిన విష‌యం విధిత‌మే.

తాజాగా  70 ఏండ్ల ఓ వృద్ధుడు అనారోగ్యానికి గుర‌వ్వ‌డంతో వైద్యం కోసం డోలీలో  మోసుకుంటూ బంధువులు తీసుకెళ్లారు. ధార‌ప‌ర్తి పంచాయ‌తీ ప‌రిధిలోని చిట్టెంపాడు గ్రామానికి చెందిన కేరింగి ధ‌ర్మ‌య్య అనారోగ్యానికి గుర‌య్యాడు. వైద్యం కోసం ఆసుప‌త్రికి తీసుకు వెళ్ల‌డానికి రోడ్డు మార్గం లేక‌పోవ‌డంతో డోలీలో దాదాపు 10కిలోమీట‌ర్ల వ‌ర‌కు తీసుకెళ్లి కొండ దించారు. ఆత‌రువాత ఆటోలో శృంగ‌వ‌ర‌పు కోట ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు వృద్ధుడిని. శృంగ‌వ‌ర‌పుకోట మండ‌లంలోని ప్ర‌జ‌లు ఇబ్బందుల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తున్న‌ది. దాదాపు 10 కిలోమేర‌కు మేర వ‌ర‌కు చిన్న‌, పెద్ద‌, తేడా లేకుండా ఎవ‌రినైనా డోలీలో మోసుకొని వెళ్లి కొండ దించాల్సిన ప‌రిస్థితి దాపురించిన‌ది. ఎన్ని సార్లు త‌మ గోడును ప్ర‌భుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన త‌మ స‌మ‌స్య‌ను మాత్రం ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అక్క‌డి గ్రామ‌స్తులు


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: