మీడియా ఛానల్ కు షాక్ ఇచ్చిన పోలీస్ లు, లోకేష్ ఏం అన్నారు...?

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చెయ్యడం దారుణం అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. పోలీసుల దాడిలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలి అని ఆయన డిమాండ్ చేసారు. న్యాయస్థానాల ఉత్తర్వులను ధిక్కరిస్తూ ఉద్యమకారుల పై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి అని కోరారు.

న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కూ అమ‌రావ‌తి రైతులు చేప‌ట్టిన మ‌హాపాద‌యాత్ర జ‌గ‌న్ స‌ర్కారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది అని  పోలీసుల్ని ప్ర‌యోగించి పాద‌యాత్ర‌కి అడుగ‌డుగునా ఆటంకాలు క‌ల్పించ‌డం న్యాయ‌మా?  అంటూ ప్రశ్నించారు. హైకోర్టు అనుమ‌తితో చేస్తున్న పాద‌యాత్ర‌కి ఖాకీల ఆంక్ష‌లు ఎందుకో?  అని నిలదీశారు. ఎండ‌న‌క‌, వాన‌న‌క  ఏడుకొండ‌ల‌వాడి స‌న్నిధికి పాద‌యాత్ర‌గా వెళ్తుంటే, వారికి సంఘీభావం తెలప‌డ‌మూ నేర‌మా? అని ప్రశ్నించారు.  పలువురు పాత్రికేయులను పోలీసులు అడ్డుకోవ‌డాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: