పీఆర్సీపై రేపే క్లారిటీ..!
తాజాగా పీఆర్సీ ప్రక్రియ ప్రారంభం అయిందని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటన చేసారు. ఇదిలా ఉండగానే మరోవైపు రేపే పీఆర్సీపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా రేపు మరోసారి జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశం జరుగనున్నది. ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టిన తరువాత జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రేపు పీఆర్సీ నివేదిక అందజేత, ఫిట్మెంట్, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై జాయింట్ స్టాప్ కౌన్సిల్ భేటిలో ప్రభుత్వం చర్చించనున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ 2 9నే పీఆర్సీ నివేదిక ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు కూడ ఇవ్వలేదని విమర్శిస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. మరి రేపు అయినా స్పష్టత వస్తుందా..? లేదా అని ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు.