సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ బిగ్గెస్ట్ విన్...?

ఆపరేషన్ ఆల్ అవుట్ పేరుతో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులను అక్కడి బలగాలు ఎరేస్తున్నాయి. పాకిస్తాన్ నుంచి వస్తున్న ఉగ్రవాదులకు చుక్కలు చూపిస్తుంది మన ఆర్మీ. ఇక తాజాగా జమ్మూకాశ్మీర్ కుల్గామ్‌లోని చవల్గామ్ ప్రాంతంలో భద్రతాదళాలు, తీవ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయని భద్రతా బలగాలు పేర్కొన్నాయి. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు హతమార్చాయి.

మృతిచెందిన ఉగ్రవాదులు హెచ్‌ఎం షిరాజ్ మోల్వి & యావర్ భట్ జిల్లా కమాండర్‌ గా అధికారులు గుర్తించారు. షిరాజ్ 2016 నుండి చురుకుగా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనడంతో పాటు అమాయక యువకులను తీవ్రవాదులలోకి చేర్చుకోవడం & అనేక పౌర హత్యలలో పాలుపంచుకున్నాడు అని అధికారులు పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌ భద్రతా బలగాలకు భారీ విజయం అని ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నాము అని సెర్చింగ్ ఆపరేషన్ జరుగుతోంది అని కాశ్మీర్  ఐజీపీ విజయ్ కుమార్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: