టీఆర్ఎస్ ఫ్లెక్సీలు కడుతూ యువకుడు మృతి
శుక్రవారం కోదాడ పట్టణంలోని రంగా సినిమా థియేటర్ సమీపంలో ధర్నాకు సంబంధించిన ప్లెక్సీని కడుతుండగా అకస్మాత్తుగా కరెంట్ షాక్ కొట్టింది. సునీల్ షాక్‌కు గురై అక్కడిక్కడే మృత్యువాతపడ్డాడు. ఈ ఘటనలో సునీల్‌తో పాటు మరో యువకుడు కుడుముల వెంకటేష్ అనే వ్యక్తి కూడ షాక్‌కు గురై తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే స్థానికులు వెంకటేష్‌ను సమీపంలో ఉన్నటువంటి ఆసుప్రతికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న కోదాడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.