వెంకటేష్ ‘దృశ్యం 2’ టీజర్ విడుదల .. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
మోహన్ లాల్ ప్రధానపాత్రలో రూపొందిన మలయాళ హిట్ చిత్రం ‘దృశ్యం 2’ సినిమాకు రీమేక్ ఈ చిత్రం ఇది.. మాతృకకు దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ ఈ సినిమాను కూడ రూపొందించడం విశేషం. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసారు. ఇటీవలే ‘నారప్ప’ సినిమాతో ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు విక్టరీ వెంకటేష్. తన నటనతో నారప్పలో వెంకటేష్ మంచి మార్కులే కొట్టేసారు. ఇదిలా ఉండగా వెంకటేష్ ప్రస్తుతం ‘ఎఫ్ 3’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసినదే. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్నది. మరోవైపు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్ ఓ సినిమా చేయనున్నారని గతంలో ప్రచారం జరిగినది. కానీ దాని గురించి అధికారిక ప్రకటన రావాల్సిఉంది.