కుప్పంలో ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ మధ్య గొడవ
టీడీపీ, వైసీపీ కార్యకర్త మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో కుప్పంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం కావడంతో మంత్రి పెద్దిరెడ్డి ఎలాగైన కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించాలని పావులు కదుపుతున్నారు. ఈ తరుణంలోనే టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ, టీడీపీ నేతలు తరుచూ ఒకరిపై మరొకరూ ఎన్నికల సందర్భంగా విమర్శలు చేసుకూనే ఉంటున్నారు. పోలీసులు ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో రెండు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేసారు.