వారు పిచ్చి కూతలు కూస్తే ఊరుకోం : దాస్యం విన‌య్ భాస్క‌ర్

N ANJANEYULU
తెలంగాణ‌లో గ‌త కొద్ది రోజుల కాలం నుంచి బీజేపీ, టీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధ‌ము జ‌రుగుతున్న విష‌యం అంద‌రికీ తెలిసిన‌దే. అయితే తాజాగా హ‌న్మ‌కొండ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే దాస్యం విన‌య్ భాస్క‌ర్ మీడియాతో ముచ్చ‌టించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేత‌ల‌పై నిప్పులు చెరిగారు దాస్యం. ఆ రెండు పార్టీల నేత‌లు ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడుతున్నారు అని.. టీఆర్ఎస్ నాయ‌కుల‌పై అన‌స‌ర‌మైన ఆరోప‌ణ‌లు చేస్తే మాత్రం ఊరుకోం అని హెచ్చ‌రించారు. ఇప్ప‌టికైనా బీజేపీ నేత‌లు పిచ్చి కూత‌లు మానుకోవాల‌ని సూచించారు విన‌య్‌భాస్క‌ర్‌.

టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు దాదాపు 60 ల‌క్ష‌ల మంది తుమ్మితే తుంప‌ర్ల‌తో బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు కొట్టుకుపోతాయ‌ని, అన‌వ‌స‌రంగా ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు అని విమ‌ర్శ‌లు చేసారు. కేంద్రం తెలంగాణ ఉద్య‌మ గొంతుక‌ల‌ను అణ‌గ‌దొక్కాల‌ని చూస్తోంద‌ని.. కేంద్రం చేసే తాటాకు చ‌ప్పుళ్ల‌కు మేము భ‌య‌ప‌డ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. వ‌రిధాన్యం కొనుగోలు పై కేంద్ర‌ప్ర‌భుత్వం పూట‌కొక మాట మారుస్తూ డ్రామాల‌ను ఆడుతోంద‌ని పేర్కొన్నారు. బీజేపీ నాయ‌కులు నిజాలు తెలుసుకుని మాట్లాడాల‌ని అని, ధాన్యం కొనుగోలుపై కేంద్రంపై ఒత్తిడిని తీసుకురావాల‌ని వెల్ల‌డించారు దాస్యం విన‌య్ భాస్క‌ర్‌.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: