ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు యువకులు మృతి

N ANJANEYULU
తూర్పు గోదావ‌రి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ది. ఎదురెదురుగా వేగంగా వ‌స్తున్న రెండు ద్విచ‌క్ర వాహ‌నాలు  బలంగా ఢీ కొన‌డంతో న‌లుగురు యువ‌కులు మృత్యువాత‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న రంప‌చోడ‌వ‌రం మండ‌లం ఐ పోల‌వ‌రం కాలువ వ‌ద్ద ఈ ప్ర‌మాదం సంభ‌వించిన‌ది. సంఘ‌ట‌న స్థ‌లంలోనే ముగ్గురు యువ‌కులు మ‌ర‌ణించ‌గా, ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌రో యుకుడు మృతి చెందాడు.

రంప‌చోడ‌వ‌రం సీఐ త్రినాథ్  వివ‌రాల‌ను వెల్ల‌డించారు.  జాగ‌రంప‌ల్లి గ్రామానికి చెందిన కోడి ర‌మేష్‌, కోసు శేఖ‌ర్‌లు సీత‌ప‌ల్లిలో జ‌రిగిన ఓ పెళ్లి వేడుక‌కు హాజ‌ర‌య్యారు. తిరిగి వెళ్తుండ‌గా మార్గ‌మ‌ధ్య‌లో గంగ‌వ‌రం మండ‌లం జీఎం పాలెం గ్రామానికి చెందిన చోడి రాజ‌బాబు, పండు అనే ఇద్దరు యువ‌కులు రంప‌చోడ‌వ‌రం నుంచి వారి స్వ‌గ్రామానికి  ద్విచ‌క్ర‌వా హ‌నం పై వెళ్తున్నారు. ఐ. పోల‌వ‌రం కాలువ వ‌ద్ద ఈ రెండు వాహ‌నాలు అక‌స్మాత్తుగా  ఎదురెదురుగా  వ‌చ్చి ఢీ కొన్నాయి. ప్ర‌మాద‌వ‌శాత్తూ శేఖ‌ర్‌, ర‌మేష్‌, పండు ఘ‌ట‌నాస్థ‌లంలో మృతి చెందారు. రంప‌చోడ‌వ‌రంలోని ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ రాజ‌బాబు మృతి చెందాడు. వీరందరూ కూడ వ్య‌వ‌సాయ కూలీలు. ఈ ప్ర‌మాదం జ‌రిగిన ఘ‌ట‌న‌పై రంప‌చోడ‌వ‌రం పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: