హీరో సూర్యకు బెదిరింపులు..!అస‌లు విష‌యం ఏమిటంటే..?

N ANJANEYULU
త‌మిళ స్టార్ హీరో సూర్య నటించిన జై భీమ్ సినిమా  అందరి మ‌న్న‌న‌లు  అందుకుంటొంది.  ఓటీటీ వేదిక ద్వారా విడుదలైన ఈ సినిమా ఘ‌న‌ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ జైభీమ్ సినిమా పై  పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  త‌మ  ప్రతిష్ఠను గిగజార్చుతున్నారంటూ  వన్నియార్ సంఘం నేత‌లు విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా నిర్మాతలు సూర్య జోతిక , దర్శకుడు టీజే జ్ఞానవేల్, అమెజాన్ ప్రైమ్ కు వన్నియార్ సంఘం నోటీసులు కూడా పంపించింది. ఈ  తరుణంలోనే హీరో సూర్య కు కూడా పలు బెదిరింపులొచ్చాయి. దీంతో  పోలీసులు ఇప్ప‌టికే బందోబస్త్ ను కూడా సూర్యకు ఏర్పాటు చేసారు. ఆర్మ్డ్ పోలీస్ లను  చైన్నై లోని సూర్య నివాసంలో  ఏర్పాటు చేశారు. సూర్య ఇంటి లోపల ఐదుగురు సాయుధ పోలీసులు మోహరించారు. ఇదిలా ఉండ‌గా.. జై భీమ్ సినిమాలో కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయ‌ని  వన్నియార్ సంఘం  ఆరోపిస్తుంది.

ఈ సినిమాపై వివాదం రోజు రోజుకూ ముదురుతున్న‌ది. ఇటీవ‌ల త‌మ వ‌ర్గాన్ని కించ‌ప‌రిచిన న‌టుడు సూర్య‌ను కొట్టిన వారికీ ఏకంగా ల‌క్ష రూపాయ‌లు బ‌హుమ‌తి ఇస్తాన‌ని పీఎంకే నేత‌లు ప్ర‌క‌టించిన విష‌యం విధిత‌మే. వ‌న్నీయార్ వ‌ర్గాన్ని కావాల‌నే ఈ చిత్రంలో అవ‌మానించారు అని పీఎంఏ నేత‌లు ఆరోపిస్తున్నారు. రూ.5కోట్లు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాలి అని జై భీమ్ నిర్మాత సూర్య‌కు వ‌న్నియార్ సంఘం నోటీసులు కూడా జారీ చేసిన విష‌యం తెలిసిన‌దే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: