ఏపీ లో మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ ఒక్క వార్డు గెలిచేందుకే ఆపసోపాలు పడుతోంది. మున్సిపాల్టీలో మొత్తం 25 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే ఒక వార్డు వైసీపీకి ఏకగ్రీవం అయ్యింది. ఇక ఇప్పుడు ఎన్నికలు జరుగుతోన్న 24 వార్డుల ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. ఇందులో ఒక వార్డులో కూడా టీడీపీ గెలవలేని పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అందుతోన్న ఫలితానుల బట్టి చూస్తే టీడీపీ కేవలం నాలుగు వార్డుల్లో ఆధిక్యంలో మాత్రమే ఉంది. చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా కూడా కుప్పంలో టీడీపీ విజయం సాధించలేని పరిస్థితి ఉంది. ఇప్పటికే 14 వార్డుల్లో లీడ్‌లో ఉన్న టీడీపీ గెలుపు దిశగా దూసుకు పోతోంది. ఇప్పటికే ఎంపీ టీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికల షాకుతో ఉన్న బాబుకు ఇది మరో పెద్ద షాకే అనుకోవాలి.