దటీజ్ యరపతినేని... ఆ మున్సిపాల్టీ టీడీపీ ఖాతాలోకే..!
ఇక దాచేపల్లి నగర పంచాయతీ కి తొలిసారిగా జరుగుతోన్న ఎన్నికల్లో ఆ పార్టీ ఇప్పటికే 20 వార్డులకు 10 వార్డులు గెలుచు కుంది. ఇక్కడ ఓ చోట ఇండిపెండెంట్ గెలిచారు. మరో రెండు వార్డుల్లో జనసేన అభ్యర్థులు గెలిచారు. ఇక్కడ పరిస్థితి చూస్తే జనసేనతో కలిస్తే టీడీపీ నగర పంచాయతీని కైవసం చేసుకోనుంది.
ఇక్కడ 14 వ వార్డులో ఇండిపెండెంట్ గెలిచారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు టీడీపీకి బాగా కలిసి వచ్చాయనే అంటున్నారు.