బ్రేకింగ్‌: జ‌గ‌న్ మేన‌మామ గెలిచేశాడు..

VUYYURU SUBHASH
ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మేన మామ ఎట్ట‌కేల‌కు విజ‌యం సాధించారు. జ‌గ‌న్ మేన‌మామ అయిన క‌మ‌లాపురం ఎమ్మెల్యే ర‌వీంద్ర నాథ్ రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గంఅయిన క‌మ‌లాపురం న‌గ‌ర పంచాయ‌తీ ఏర్ప‌డింది. ఈ పంచాయ‌తీకి తొలిసారిగా ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ అన్ని వార్డుల్లోనూ త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌ను పోటీకి పెట్టింది. ఒక్క వార్డు కూడా వైసీపీకి ఏక‌గ్రీవం కాలేదు. దీంతో ఇక్క‌డ అధికార పార్టీ నేత‌ల్లో టెన్ష‌న్ స్టార్ట్ అయ్యింది. అయితే ఈ రోజు కౌంటింగ్‌లో వైసీపీ స‌త్తా చాటింది. ఇప్ప‌టికే వెల్ల‌డి అయిన 13 వార్డుల్లో వైసీపీ ఏకంగా 12వార్డుల్లో విజ‌యం సాధించి న‌గ‌ర పంచాయ‌తీ కైవ‌సం చేసుకుంది.టీడీపీ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క వార్డులో మాత్ర‌మే గెలిచింది. దీంతో ర‌వీంద్ర నాథ్ రెడ్డి క‌మ‌లాపురం కోట‌లో త‌న ప‌ట్టు నిలుపుకు న్న‌ట్టు అయ్యింది. దీంతో అక్క‌డ వైసీపీ శ్రేణు ల ఆనందానికి అవ‌ధులు లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: