జ‌గ్గ‌య్య‌పేట‌లో గెలిచిన టీడీపీ.. ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే

VUYYURU SUBHASH
ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో భాగంగా ఖాళీ గా ఉన్న మున్సిపాల్టీ ల‌కు రెండు రోజుల క్రితం ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఈ రోజు వెల్ల‌డి అవుతున్నాయి. కృష్ణా జిల్లాలో జ‌గ్గ‌య్య‌పేట తో పాటు కొండ‌ప‌ల్లి మున్సిపాల్టీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ఈ రోజు జ‌రుగుతోంది. అయితే జగ్గయ్యపేట కౌంటింగ్ కేంద్రంలో ఉద్రిక్త ప‌రిస్థాతి నెల‌కొంది. 13వ వార్డు టీడీపీ అభ్యర్థి 5 ఓట్లతో గెలిచిన‌ట్టు అధికారులు ప్ర‌క‌టించారు.

అయితే రీకౌంటింగ్‍కు వైసీపీ పట్టు ప‌ట్టింది. అయితే జ‌గ్గ‌య్య‌పేట ఎమ్మెల్యే సామినేని ఉద‌య‌భాను దగ్గరుండి రీకౌంటింగ్ చేయించారు. రీ కౌంటింగ్ లో కూడా మ‌ళ్లీ టీడీపీ 5 ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించింది. అయితే రీ కౌంటింగ్ స‌రిగా లేద‌ని ఉద‌య భాను అనుచ‌రులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఇప్పుడు అక్క‌డ మూడోసారి కౌంటింగ్ జ‌రుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: