తిరుపతిలో కనీవిని ఎరుగని జలప్రళయం
ఘాట్ రోడ్డులో 13 చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. ఇవాళ కూడా తిరుమలలో నడక మార్గాలు మూసివేసారు. అలిపిరి, శ్రీవారి కాలినడక మార్గాలతో పాటు పాపవినాశనం రహదారిని మూసివేశారు. శ్రీవారి వైకుంఠ కాంప్లెక్స్ లోకి భారీగా వరద నీరు చేరినది. వాతావరణం ప్రతికూలతతో పలు విమానాలను దారి మళ్లించారు. క్యూలైన్ కాంప్లెక్స్‌లోకి వరద నీరు చేరడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమీప ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తిరుపతి ప్రసూతి ఆసుపత్రిలోకి వరద నీరు చేరడంతో విద్యుత్ సరఫరా నిలిపేశారు. అదేవిధంగా కపిలతీర్థం వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరడంతో.. అక్కడ ఎనిమిది అడుగుల మేర గోడ కూలిపోయింది. ఘాట్‌రోడ్డులో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఎక్కడికక్కడ కొండ చరియలు విరిగి పడిపోతున్నాయి. అత్యవసరంగా ఘాట్ రోడ్డు ను మూసివేసింది టీటీడీ.