జగన్ ను నమ్ముకున్న ఆ ఇద్దరు, ఇప్పటికి న్యాయం జరిగింది...!

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, అభ్యర్థులుగా, విశాఖ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేసారు వైసీపీ నేతలు వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి. వారి వెంట ఎంపీ విజయసాయిరెడ్డి ఎంవి సత్యనారాయణ ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సహా పలువురు నేతలు వెళ్ళారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారిని విస్మరించరు అనడానికి వీరి ఎంపిక ఉదాహరణ అని స్పష్టం చేసారు.

గతంలో వంశీకృష్ణ ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి అని వరుదు కల్యాణి ,ఎం.పి కావల్సిన వ్యక్తి.కొన్ని కారణాల వల్ల టిక్కెట్ ఇవ్వలేకపోయాము అని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని పార్టీకోసం పని చేశారు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ అవుతున్నారు అని భవిష్యత్తులో ఇంకా మరిన్ని పెద్ద పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాను అన్నారు. మరో ఇరవై ఏళ్లు జగన్ సీఎంగా ఉంటారు అని ఆయన స్పష్టం చేసారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరినీ గుర్తుపెట్టుకుంటున్నారు అని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: