నేటి నుంచి జంట నగరాల్లో ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు
ముఖ్యంగా కొన్ని రైల్వే మార్గాలపై మరమ్మతులు చేపడుతుండడంతోనే ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసామని అధికారులు పేర్కొంటున్నారు. సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వెళ్లే ఎంఎంటీఎస్, లింగంపల్లి నుంచి హైదరాబాద్ వెళ్లేవి, అలాగే లింగంపల్లి నుంచి ఫలక్ నుమా కు వెళ్లే ఎంఎంటీఎస్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఎంఎంటీఎస్‌లో ప్రయాణించే ప్రయాణికులు రైళ్ల రద్దును గమనించి వేరే మార్గంలో ప్రయాణాన్ని ఎంచుకోవాలని సూచించారు. బుధవారం నుంచి యధావిధిగా ఎంఎంటీఎస్ సేవలు కొనసాగనున్నాయి.