మూడు రాజధానుల ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి ఏమన్నారంటే..?
రాజధాని పేరుతో ఉద్యమం చేసేది కేవలం పెయిడ్ ఆర్టిస్టులే అని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్ అని చెప్పారు. ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమీ కాదని వెల్లడించారు. అమరావతి రైతుల పాదయాత్ర లక్షలమందితో సాగుతోందా అని ప్రశ్నించారు. నేను ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. రైతులు చేపట్టిన పాదయాత్ర చూసి చట్టం ఉపసంహరించుకోలేదని తెలిపారు. సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర అభివృద్ధి కోసమే అని మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు.