బాల‌య్య ఒక ఆటంబాంబ్‌ : ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి

N ANJANEYULU

నంద‌మూరి బాల‌కృష్ణ-బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్ర‌ము  డిసెంబ‌ర్ 02న విడుద‌ల కానున్నది అఖండ‌. శ‌నివారం అఖండ‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను శిల్పక‌ళావేధిక‌లో  అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించారు.  ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హాజ‌రవ్వ‌గా.. స్పెష‌ల్ గెస్ట్‌గా  అగ్ర‌ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి హాజ‌ర‌య్యారు.  ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి మాట్లాడారు.
ముఖ్యంగా అఖండ చిత్రంతో మ‌ళ్లీ థియేట‌ర్ల‌ను ఓపెన్ చేయించినందుకు బోయ‌పాటి గారికి స్పెష‌ల్ థాంక్స్ చెప్పారు రాజ‌మౌళి. డిసెంబ‌ర్ 02 నుంచి మొద‌లు పెట్టి కంటిన్యూస్‌గా మ‌ళ్లీ థియేట‌ర్లు ఇంత అరుపులు, కేక‌ల‌తో ఉంటాయ‌నిపేర్కొన్నారు.   ఇక్క‌డ కూర్చుని ఉన్న మాకు ఎంత ఆనందం వ‌స్తుందో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన‌య‌న అభిమానుల‌కు కూడా అంతే ఆనందం వ‌స్తుంద‌ని కోరుకుంటున్న‌ట్టు తెలిపారు. బాల‌య్య బాబు ఒక ఆటంబాంబు అని.. ఆ ఆటంబాంబ్‌ను  ఎలా ప్ర‌యోగించాలో బోయపాటికి మాత్ర‌మే తెలుసు అని పేర్కొన్నారు. బాల‌య్య ఎన‌ర్జీ సీక్రెట్ తెలుసుకోవాల‌ని ఉంద‌ని, ఇప్పుడు చూసింది కేవ‌లం మ‌చ్చుతున‌క‌, సినిమా ఇంకా అదిరిపోతుంద‌ని అన్నారు. నేను ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షోకు వెళ్తాను అని వెల్ల‌డించారు రాజ‌మౌళి. అఖండ పెద్ద హిట్ అవ్వాల‌ని, మ‌ళ్లీ మా ఇండ‌స్ట్రీకి కొత్త ఊపు తీసుకురావాల‌ని కోరుకుంటున్నాన‌ని ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి చెప్పుకొచ్చారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: