వెల "సిరి" : సిరివెన్నెల పార్థీవదేహం వద్ద కన్నీరుమున్నీరైన తనికెళ్ళ

N ANJANEYULU
లెజెండరీ తెలుగు గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధిత సమస్యలతో మంగళవారం సాయంత్రం 4 గంట‌ల కన్నుమూశారు. 66 ఏండ్ల‌ గీత రచయిత ఆకస్మిక మరణ వార్త త‌రువాత‌ దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు సీతారామశాస్త్రికి నివాళులు అర్పిస్తున్నారు. సిరివెన్నెల 1984లో జననీ జన్మభూమితో అరంగేట్రం చేసారు సినిమా రంగానికి,  కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘సిరివెన్నెల’ చిత్రంలో ‘విధాత తలపున’ అనే పాటతో కీర్తిని పొందారు. నంది అవార్డును కూడా ద‌క్కించుకున్నారు.  శాస్త్రి దాదాపు 3వేల‌కు పైగా పాటలకు సాహిత్యమును అందించారు. ఇప్పటికే ఆయన మృతికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీతో సహా ట్విట్ట‌ర్‌లో సంతాపం తెలిపారు. ఇవాళ ఉద‌యం నుంచి ఫిల్మ్ ఛాంబ‌ర్ సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో నిండిపోయిన‌ది. ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్‌, గుణ‌శేఖ‌ర్‌, ఎస్వీ కృష్ణారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, బాల‌కృష్ణ‌, అల్లుఅర్జున్‌, రానా, అల్లుఅర‌వింద్‌, ఎం.ఎం.కీర‌వాణి, నాని, సాయికుమార్‌, త‌నికెళ్ల భ‌రిణి ఇలా పలువురు ఒక్కొక్కరుగా చేరుకుని  సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

 ఫిలిం ఛాంబర్ లో సిరివెన్నెల పార్థీవదేహం అభిమానుల సందర్శనార్థం ఉంచగా..  అక్కడికి సినీ సెలెబ్రిటీలు పెద్ద ఎత్తున తరలివచ్చి కడసారి నివాళులు అర్పిస్తున్నారు సిరివెన్నెల‌కు.  ఈ తరుణంలోనే ఆయన పార్థీవదేహం వద్ద తనికెళ్ళ భరణి కన్నీరుమున్నీరుగా విలపించారు. “సీతారామశాస్త్రీ నాకు అన్నయ్య అని,  నాకన్నా రెండు నెలలే పెద్దంటూ  ఆయనకు సాహిత్యం అంటే ఎంత ఇష్టం అని గుర్తు  చేసారు. అర్ధరాత్రి 2 గంటలకు కూడా నిద్ర‌ లేచి పాడేవారు. ఇండస్ట్రీలో ఈ శూన్యాన్ని పూరించడం చాలా కష్టం అని తెలిపారు. అక్ష‌రాలతో ప్ర‌తీ ప‌దాన్ని చెక్కార‌ని, వ‌జ్రం పొడిగిన‌ట్టు అందుకే ఆయ‌న పాట‌ల ప్ర‌కాశం తెలుగు భాష, తెలుగు జాతి ఉన్నంత వ‌ర‌కూ ఉంటుంద‌ని క‌న్నీటి పర్వంత‌మ‌య్యారు త‌నికెళ్ల భ‌రిణి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: