అమెజాన్ కీలక నిర్ణయం.. ఇక నుంచి అలెక్సా ర్యాంకులు బంద్

N ANJANEYULU
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజమైన‌ అమెజాన్ కీలక నిర్ణయం తీసుకున్న‌ది. వెబ్‌సైట్ ర్యాంకింగ్ సర్వీస్ అలెక్సా.కామ్‌ను షట్‌డౌన్ చేస్తున్నట్టు అమెజాన్ సంస్థ‌ ప్రకటించింది. వచ్చే ఏడాది మే నెల నుంచి దీనిని అమలు చేయనున్నట్టు వెల్ల‌డించింది. అలెక్సా.కామ్ ద్వారా వెబ్‌సైట్‌ల స్టాటిస్టిక్స్, వాటి ర్యాంకులను అమెజాన్ అందిస్తున్న‌ది. అదేవిధంగా ఎస్‌ఈవో రీసెర్చ్, అనాలిసిస్ టూల్స్ కూడా అందిస్తోంది. పెయిడ్ వెర్షన్ తీసుకున్న‌యితే  పలు రకాల ఎస్‌ఈవో సర్వీసులను కూడా వినియోగదారులు పొందొచ్చు.

స‌ర్వీస్‌ను ష‌ట్‌డౌన్ చేసేలోగా ఆయా వెబ్‌సైట్‌లు త‌మ డేటాను పొందే అవ‌కాశాన్ని అమెజాన్ క‌ల్పించిన‌ది. డిసెంబ‌ర్ 08, 2021 నుంచి కొత్త స‌బ్ స్క్రైబ‌ర్ల‌ను  చేర్చుకోవ‌డం లేదు అలెక్సా. అలెక్సా.కామ్ సర్వీస్‌ను  1996 ఏప్రిల్ నెలలో అమెజాన్ లాంచ్ చేసిన‌ది. అన‌గా స‌రిగ్గా 25 ఏండ్ల‌ త‌ర్వాత మే 2022లో ఈ స‌ర్వీస్‌ను అమెజాన్ ష‌ట్‌డౌన్ చేయనున్న‌ది. అమెజాన్ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ఓ వెబ్‌సైట్ ర్యాంకును అంచెనా వేయ‌డానికి అలెక్సా ర్యాంకును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం ఇక నుంచి కుద‌ర‌దు. ప్ర‌స్తుతం వివిధ అడ్వ‌ర్‌టైజ్‌మెంట్ల కోసం కంపెనీలు త‌మ ప్ర‌క‌ట‌న‌లను వెబ్‌సైట్‌ల‌లో ప్ర‌చురించ‌డానికి అలెక్సా ర్యాంకునే ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: