బిపిన్ రావత్ రావత్ దంపతుల అంతిమయాత్ర కొనసాగినది. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్ స్క్వేర్‌లోని శ్మశానవాటికకు బయలుదేరినది. ప్రజలుభరత భూమి పుత్రుడు రావత్ అమర్ రహే అంటూ చేసిన నినాదాలు హోరెత్తాయి. ఢిల్లీ కామ్రాజ్ మార్గ్ లోని రావత్ నివాసం నుంచి వాహనంలో భౌతికకాయాలనుంచారు. నేతలు, సైనికులు పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంతకుముందు రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు నేతలు రావత్ దంపతుల భౌతికకాయాలకు నివాళులు అర్పించారు.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ దంపతుల అంత్యక్రియల కార్యక్రమానికి శ్రీలంక, నేపాల్, భూటాన్ ఆర్మీ అధికారులు వచ్చారు. వీర నాయకుడికి అంతిమ వీడ్కోలు పలికేందుకు జనం భారీగా తరలివచ్చారు. పార్దీవదేహంతో వెళ్తున్న వాహనంపై జనం పువ్వుల వర్షం కురిపించారు. కొందరు యువత జాతీయ జెండాలను చేతుల్లో పట్టుకుని అంతిమ యాత్రలో భారత్ మాతాకి జై అనే నినాదాలు ఆ వాహనం వెంట పరుగులు తీసారు. వీర సైనికుడు బిపిన్ రావత్ అంతిమయాత్రలో.. ఇండియన్ ఆర్మీ జిందాబాద్.. వందేమాతరం అంటూ నినాదాలు మారుమ్రోగాయి.