మంత్రి ముందే టీఆర్ఎస్ నేతల బాహాబాహీ
అయితే ఇవాళ తాండూరులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలోనే ఇరు వర్గాల నేతల మధ్య మాటల యుద్ధంకొనసాగింది. దీంతో వెంటనే మంత్రి సబితా స్పందించి ఇరు వర్గాల నేతలను సముదాయించారు. టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేసే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తుంటే.. పార్టీ నేతలు ఇలా వర్గ పోరుకు దిగడం ఏమిటి అని కొందరూ చర్చించుకుంటున్నారు. తాండూర్లో దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాన్ని ప్రారంభించడానికి మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సురభివాణిలు హాజరయ్యారు. మరొవైపు ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి స్థానికంగా ఉన్న కార్యక్రమాలలో తనకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని అధికారిని అడిగి వెళ్లిపోయారు.