మంగళగిరిలో 12న పవన్ కళ్యాణ్ దీక్ష
విశాఖ ఉక్కును ప్రయివేటు పరం చేస్తే ఊరుకునేది లేదని జనసేప పార్టీ సైతం గతంలోనే పేర్కొన్న విషయం తెలిసినదే. కార్మికులకు మద్దతు తెలిపినది. ఇప్పుడు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ దీక్ష చేయబోతున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ డిసెంబర్ 12న అనగా ఎల్లుండి దీక్ష చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు పీఏసీ సభ్యులు, జిల్లాల పార్టీ నేతలు దీక్షలో పాల్గొననున్నారు. పవన్ కళ్యాణ్ దీక్షపై బీజేపీ, అధికార వైసీపీ ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి మరీ.