అబ్దుల్లాపూర్‌మెట్‌లో లారీ బీభత్సం..!
అయితే మృతి చెందిన విద్యార్థి సిరిసిల్లలోని ప్రగతి నగర్‌కు చెందిన ప్రణయ్ గౌడ్‌గా గుర్తించారు. ప్రణయ్ విజ్ఞాన్ కళాశాలలో ఇంజినీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఇంజినీరింగ్ విద్యార్థి ప్రణయ్ ప్రాణాలను బలితీసుకున్నది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదం జరిగిన విధానంపై పరిశీలించారు. లారీని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్టు వెల్లడించారు పోలీసులు.