నేడు త‌మిళ‌నాడుకు సీఎం కేసీఆర్

N ANJANEYULU
తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు ఇవాళ శ్రీ‌రంగంలోని రంగ‌నాథ స్వామిని ద‌ర్శించుకోనున్నారు. ఉద‌యం 11 గంట‌ల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి బ‌య‌లుదేరి బేగంపేట‌కు చేరుకుంటారు సీఎం. 11.10 గంట‌ల‌కు ప్ర‌త్యేక విమానంలో బ‌య‌లుదేరి 12.30కు త‌మిళ‌నాడులోని తిరుచి చేరుకోనున్నారు. హోట‌ల్‌లో బ‌స చేసిన త‌రువాత‌.. రోడ్డు మార్గంలో శ్రీ‌రంగంలోని రంగ‌నాథ స్వామి ఆల‌యాన‌కి వెళ్లి.. మ‌ధ్యాహ్నం 2.10 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ రంగ‌నాథ స్వామికి ప్ర‌త్యేక పూజ‌లు చేయిస్తారు.

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు తిరుచి విమాన‌శ్ర‌యానికి ప‌య‌న‌మై.. అక్క‌డి నుంచి ప్ర‌త్యేక విమానంలో చెన్నై చేరుకుంటారు. ఐటీసీ గ్రాండ్ చోళ‌లో బ‌స చేసి.. ఆ త‌రువాత చెన్నైలో తెలంగాణ మాజీ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ను క‌లువ‌నున్నారు. త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్‌తో రేపు ప‌లు అంశాల‌పై చ‌ర్చించ‌నున్నా తెలంగాణ ముఖ్య‌మంత్రి. కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌పై స్టాలిన్ ప‌లు అంశాల‌పై చ‌ర్చిస్తారు. ముఖ్యంగా కేంద్రం రాష్ట్రాల‌పై అనుస‌రిస్తున్న వైఖ‌రి, దేశంలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై త‌మిళ‌నాడు, తెలంగాణ రెండు రాష్ట్రాల సీఎంలు సుదీర్ఘంగా చ‌ర్చించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: