తమిళంలో 'భరత్ అను నేను' మంచి వసూళ్లు రాబట్టింది : జూనియర్ ఎన్టీఆర్

Purushottham Vinay
ఇక ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ ఇప్పుడు బాగా జోరుగా సాగుతున్నాయి. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుంది కాబట్టి మేకర్స్ అన్ని భాషల్లో కూడా ప్రమోషన్స్ గట్టిగా మొదలు పెట్టారు. ఇక ఈ నేపథ్యంలో తమిళంలో ప్రమోషన్ చేస్తున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్‌ని తమిళంలో ఒక రిపోర్టర్ ఇలా అడిగాడు, "విజయ్ వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్నారు, శేఖర్ కమ్ములతో ధనుష్, ఇప్పుడు శివ కార్తికేయన్ కూడా ప్రవేశించారు, మీరు పోటీని ఎలా ఎదుర్కోబోతున్నారు?" అని ప్రశ్నించారు. 


ఇక దీనికి జూనియర్ ఎన్టీఆర్ బదులిస్తూ ఇలా అన్నాడు.."పోటీ బాగుంటుంది, ప్రతిభ మనుగడకు మరియు హద్దులు దాటడానికి చాలా అవసరం" అని తారక్ తమిళంలో సమాధానమిచ్చాడు.అలాగే తమిళంలో బాహుబలితో పాటు  మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా కూడా మంచి వసూళ్లు రాబట్టిందని అన్నారు. ఇక ఆ తర్వాత ఇక్కడ ప్రాంతీయ సినిమాలు లాంటి భేదాలేవి లేవని, అన్ని సినిమాలు కూడా కేవలం భారతీయ సినిమాలే అని ఎన్టీఆర్ ఉటంకించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: