సైరా విజయమే.. ఆర్ఆర్ఆర్ నమ్మకం : రామ్చరణ్
తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడం భాషల్లో తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమా ప్రమోషన్లను భారీగానే ప్లాన్ చేసింది చిత్ర బృందం. రోజుకొక చోట ప్రెస్మీట్ పెట్టి ప్రమోషన్స్ పెంచుతున్నారు. తాజాగా తమిళంలో ప్రమోషన్ల సందర్భంగా రామ్చరణ్ మాట్లాడుతూ.. సైరా విజయం నాకు ఆర్ఆర్ఆర్ భారీ విజయం అందిస్తుందనే నమ్మకాన్ని ఇచ్చిందని రామ్చరణ్ పేర్కొన్నారు. తమిళం అంటే నాకు ఎంతో ఇష్టమని.. తమిళం కూడా కొన్ని కథలు వింటున్నానని త్వరలో తమిళంలో సినిమా కూడా చేయనున్నట్టు చెప్పారు చరణ్.