ఒమిక్రాన్ : తెలంగాణలో మళ్లీ కేసులు.. ఇవాళ ఎన్నంటే..?
తాజాగా తెలంగాణ రాష్ట్రంలో నూతనం మరొక 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7 కు చేరుకున్నది. అయితే.. ఇవాళ ఒమిక్రాన్ సోకిన వారిలో ముగ్గురు కెన్యా నుంచి వచ్చిన వారు కాగా.. మరొకరు భారత్‌కు చెందిన వ్యక్తిలో ఈ వేరియంట్‌ను నిర్ధారించారు. ఇక తెలంగాణలో కేసులు పెరగడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అలెర్ట్ అయింది. ఇప్పటికే దేశంలో మహారాష్ట్రలో 32, రాజస్థాన్ 17, కర్నాటక 08, కేరళ 05, గుజరాత్ 05, ఆంధ్రప్రదేశ్ 01, చతీష్ఘడ్ 01, పశ్చిమబెంగాల్ 01, పశ్చిమబెంగాల్ 01 కేసులు నమోదు అవ్వగా.. మొత్తం 87 కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసులు ఇప్పటివరకు 87కు చేరాయి.