పద్మ విజేతలకు సీజేఐ ఎన్వీ రమణ శుభాకాంక్షలు..!

frame పద్మ విజేతలకు సీజేఐ ఎన్వీ రమణ శుభాకాంక్షలు..!

Chakravarthi Kalyan
పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు తేజాలకు భారత ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ శుభాకాంక్షలు చెప్పారు. పద్మభూషణ్ పురస్కారం అందుకోనున్న శ్రీకృష్ణ ఎల్ల, శ్రీమతి సుచిత్ర ఎల్ల, శ్రీ నాదెళ్ల సత్యనారాయణ,  పద్మశ్రీ కి ఎంపికైన శ్రీ గరికిపాటి నరసింహారావు, కీర్తిశేషులు శ్రీ గోసవీడు షేక్ హసన్,   శ్రీ దర్శనం మొగిలయ్య,  శ్రీ రామ చంద్రయ్య, డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు, శ్రీమతి పద్మజ రెడ్డిలను అభినందించారు. న్యాయమూర్తి ఎన్వీ రమణ పేరు పేరునా అభినందనలు ప్రకటించారు.



తెలుగుజాతి కీర్తి పతాకను కోవిడ్ టీకా ఆవిష్కరణతో విశ్వ వినువీథుల్లో ఎగురవేసిన ఎల్లా దంపతులు, అతిపెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీకి సారథ్యం వహిస్తున్న నాదెళ్ల సత్యనారాయణ పద్మభూషణ్ కు ఎంపికవడం ముదావహం అన్నారు. చక్కని తెలుగు వాచకంతో, అర్థవంతమైన ప్రవచనాలతో తెలుగు సాహితీ లోకాన్ని సుసంపన్నం చేసిన  గరికిపాటి నరసింహారావు గారికి అవార్డు రావడం సంతోషదాయం అన్నారు ఎన్వీ రమణ.  విభిన్న రంగాల్లో విశిష్ట సేవలందించిన ఇతర పద్మశ్రీ అవార్డు గ్రహీతలు తెలుగు జాతికి గర్వకారణమని జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: