ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్.. ఏంటంటే..?
అలాగే ఫిబ్రవరి 7 తేదీలోగా బదిలీలకు సంబంధించిన దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. ఫిబ్రవరి 15 లోగా దరఖాస్తులు పరిశీలించి తుది జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్చి 1 తేదీ నుంచి వైద్యారోగ్యశాఖలో బదిలీలపై తిరిగి నిషేధం వర్తిస్తుందని లేఖలో ప్రభుత్వం పేర్కొంది. 2022 ఫిబ్రవరి 28 తేదీనాటికి ఒకే చోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు బదిలీ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే ఒకో చోట 3 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు బదిలీ కోసం అభ్యర్ధించే అవకాశం కల్పించింది.