షాకింగ్: ఆ ఉద్యోగులకు ఏపీ సర్కారు మెమోలు..?
జీతాల బిల్లులు ప్రాసెస్ చేయని డీడీవోలు, ట్రెజరీ అధికారులపై చర్యలు ఏపీ సర్కారు జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. సంబంధిత విభాగాధిపతులకు ప్రభుత్వం నేరుగా ఆర్డర్లు పాస్ చేసింది. విధుల్లో విఫలమైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసింది. కొత్త పే స్కేళ్ల ప్రకారం జీతాల చెల్లింపు ఏర్పాట్లు చేయాల్సిందిగా మరోసారి అధికారులకు తేల్చి చెప్పింది. ఇందుకు సిబ్బంది సహకరించకపోతే ఇతర ఏర్పాట్లు చేయాలని కోరింది. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ ఈ మేరకు ఆర్డర్లు పాస్ చేశారు.