బ్రేకింగ్ : కామన్వెల్త్ గేమ్‌లో క్రికెట్‌కు చోటు
కామన్వెల్త్ గేమ్స్ లో మహిళలు తొలిసారి క్రికెట్ ఆడనున్నారు. ఈ మేరకు ఆస్ట్రేలియా, భారత్, బార్బడోస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక జట్లు ఈ టోరనీకి అర్హత సాధించినట్టు ఐసీసీ వెల్లడించింది. ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థులయినటువంటి భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూపులో ఉండడం విశేషం. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, బార్బడోస్ జట్లు ఉండగా.. గ్రూప్ బీలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్ టీమ్‌లున్నాయి. మహిళల టీ-20 జట్టు ప్రపంచకప్ ఫైనలిస్ట్‌లు ఆస్ట్రేలియా, భారత్ జట్లు జులై 29న తలపడే మ్యాచ్‌తో కామన్వెల్త్ క్రీడలలో క్రికెట్ పోటీలు ప్రారంభం కానున్నాయి.