ఆ రాష్ట్రాన్ని వదలట్లేదు.. 50 వేల కేసులు, 1200 మరణాలు..?

Chakravarthi Kalyan
కరోనా దేశవ్యాప్తంగా బాగా తగ్గుముఖం పడుతోంది. వందలు, వేల సంఖ్యలో కేసులు వస్తున్నా చాలా మందిలో పెద్దగా ప్రభావం చూపడం లేదు. అందుకే జనం కరోనాను లైట్‌ గా తీసుకుంటున్నారు. అయితే.. అనేక  రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతున్నా.. ఓ రాష్ట్రాన్ని మాత్రం కరోనా వెంటాడుతూనే ఉంది. కేరళలో వైరస్‌ ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు.


తాజాగా మళ్లీ అక్కడ కొత్త కేసులు 50వేలు దాటాయి. మంగళవారం కేరళలో 51,887 కేసులు వచ్చాయి. సోమవారంతో పోలిస్తే కేరళలో కేసులు మరో 9వేలు పెరిగాయి. అంతే కాదు.. కేరళలో మరణాలు కూడా పెరిగాయి. ఏకంగా 1200పైగా చావులు నమోదయ్యాయి. అయితే.. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం మరణాలను నమోదు చేయడం వల్లే ఇలా ఒక్కరోజులో 1200 మరణాలు నమోదైనట్టు తెలుస్తోంది. మొత్తం మీద కేరళలో కరోనా మృతుల సంఖ్య 55,600కు చేరుకుంది. కేరళలో కొత్తగా 40,383 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. కేరళలో ప్రస్తుతం 3,67,847 యాక్టివ్‌ కరోనా కేసులున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: