ఉద్యోగుల ఉద్యమం.. జగన్ ఆంక్షల వ్యూహం?
అయితే.. రేపటి 'చలో విజయవాడ' కార్యక్రమానికి పోలీసుల ఆంక్షలు పెడుతున్నారు. 'చలో విజయవాడ'కు పోలీసులు అనుమతి నిరాకరించారు. చలో విజయవాడకు బయల్దేరుతున్న ఉద్యోగులను అడ్డుకుంటున్నారు. వివిధ జిల్లాల్లోని ఉద్యోగ సంఘాల నేతలను గృహనిర్బంధం చేస్తున్నారు. చలో విజయవాడకు ఉద్యోగులు రావద్దని పోలీసులు చెబుతున్నారు. విజయవాడ వెళ్లవద్దని నోటీసులు జారీచేశారు. అంతేకాదు.. ఉద్యోగ సంఘాల నాయకుల ఇళ్ల చిరునామాలు సేకరిస్తున్నారు. విజయవాడకు వచ్చేవారి వివరాలు సేకరించాలని వాలంటీర్లకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఉత్తర్వులు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులు ఇచ్చారు.