బీ రెడీ: డిజిటల్ కరెన్సీ ఎప్పుడు వస్తుందో చెప్పేసిన కేంద్రం..?
ప్రస్తుతం ప్రైవేటు కంపెనీల ఆధ్వర్యంలో ఉన్న ఎలక్ట్రానిక్ వ్యాలెట్ల తరహాలోనే డిజిటల్ కరెన్సీ కూడా పనిచేస్తుందని చెబుతున్నాయి. ఈ కరెన్సీకి ప్రభుత్వ హామీ ఉంటుందని క్లారిటీ ఇచ్చాయి. రిజర్వు బ్యాంకు మద్దతుతో డిజిటల్ రూపీని ప్రవేశపెట్టనున్నట్లు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ప్రకటించారు.
ఈ డిజిటల్ కరెన్సీ కోసం ఆర్‌బీఐ ప్రత్యేక నెంబర్లను కేటాయిస్తుంది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న నగదుతో పోలిస్తే డిజటల్ కరెన్సీ అంతకంటే భిన్నంగా ఏమీ ఉండదట. డిజిటల్ కరెన్సీని సాధారణ కరెన్సీకి డిజిటల్ రూపంగానూ చెల్లింపులు జరపొచ్చు.