షాకింగ్‌: యూట్యూబ్‌ స్టార్‌ సరయు అరెస్ట్..?

Chakravarthi Kalyan
యూట్యూబ్‌ స్టార్‌, బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కంటెస్టెంట్ సరయును బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. బోల్డ్ కామెంట్స్‌తో సరయు ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటుందన్న సంగతి తెలిసిందే. మరి ఆమెను ఎందుకు పోలీసులు అరెస్టు చేశారు..? హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఓ పాటలో నటించినందుకు సరయుపై విశ్వ హిందుపరిషత్‌ వారు సరయుపై సిరిసిల్ల జిల్లాలో ఫిర్యాదు చేశారు.

ఓ హోటల్ ప్రమోషన్ సాంగ్‌లో సరయు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిందట. ఆమెపై వీహెచ్‌పీ నేత  ఫిర్యాదు చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా పాట రూపొందించారన్న అభియోగంపై సరయుపై 153a, 295a సెక్షన్ ల కింద బంజారాహిల్స్‌ పోలీసులు కేసు పెట్టారు. ఆ తర్వాత సోమవారం రాత్రి ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ముందు రాజన్న సిరిసిల్ల పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత దాన్ని హైదరాబాద్ బంజారాహిల్స్ పీఎస్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు.

ఆ ప్రమోషన్ సాంగ్‌లో సరయుతో పాటు మరికొందరు గణపతి బప్పా మోరియా బ్యాండ్‌ను తలకు ధరించారట. దేవుడి బొమ్మలు ధరించి.. మద్యం సేవించి హోటల్‌ను సందర్శిస్తారనేలా ఆ సాంగ్‌ ఉందట. అందుకే హిందువుల మనోభావాలను కించపరినందుకు  చర్యలు తీసుకోవాలని చేపూరి అశోక్ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా సరయును అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: